టీడీపీకి 38 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు దొరకని పరిస్థితి – పేర్ని నాని

మాజీ మంత్రి పేర్ని నాని టిడిపి ఫై చంద్రబాబు పలు విమర్శలు చేసారు. 175కి 175 చోట్ల వైస్సార్సీపీ ని ఓడిస్తానంటున్నా చంద్రబాబు…అసలు 38 నియోజకవర్గాల్లో టీడీపీ కి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందన్నారు.

175లో పవన్ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ఇస్తున్నారు.. బీజేపీలో టీడీపీ జెండా మోస్తున్న వారికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీని తాకట్టు పెట్టిన నారాయణ ,రామకృష్ణకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు.. రాహుల్ గాంధీకి ఎన్ని సీట్లు ఇస్తున్నావ్.. రాహుల్ గాంధీని పోటీ పెడుతున్నారా.. 72 ఏళ్లు వచ్చాయి… ఇంకా ఉత్తర కుమార ప్రగల్భాలెందుకు. పది మందిని కలుపుకుంటే కానీ.. పోటీ చేయడానికి సాహసం చేయలేని దుస్థితి మీది. పవన్, బాలకృష్ణతో తిరిగి మాపై సినిమా డైలాగ్‌లు వదులుతున్నారు’ అని పేర్ని నాని సెటైర్లు వేశారు.

‘ వైనాట్ పులివెందుల అనే వారందరికీ ఇదే నా ఆహ్వానం. చంద్రబాబు, పవన్ పులివెందులలో పోటీ చేయండి. ఇద్దరూ విడివిడిగా పోటీ చేసినా.. ఒప్పందం చేసుకుని పోటీ చేసినా పర్వాలేదు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేయండి.. మీరో మేమో.. తేలిపోతుంది. 21 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగితే.. నాలుగు గెలిచారు. నాలుగు గెలిచి సంకలు గుద్దుకోవడం దేనికి. ఇక ఈ జన్మలో గెలుపు చూడలేరనే భావనతోనే ఈ సంబరాలు చేసుకున్నారని నాని ఎద్దేవా చేసారు.