పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని కౌంటర్ ..

perni-nani-counter-on-pawan-kalyan-

రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ 45-67 స్థానాలకే పరిమితమవుతోందని తనకు సర్వేలు అందాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి , వైస్సార్సీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ముందు మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో సర్వే చెప్పలేదా? అందులో ఎన్ని గెలుస్తారనేది చిలక జోస్యంలో రాలేదా? అంటూ తనదైన శైలిలో నాని కౌంటర్లు ఇచ్చారు.

మంగళగిరిలో పార్టీ లీగల్​ సెల్​ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీకి 47-67 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇంత స్థాయిలోవైస్సార్సీపీ పడిపోవడానికి కారణం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమేనని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని వారికి.. చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలనిపించిందని.. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే జనసేన పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు.

ఎన్నికల్లో గెలిచేంత వరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన జీవితంలో చేసిన మంచి పని జనసేన పార్టీ పెట్టడమేనని పేర్కొన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైస్సార్సీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. ముందు మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో సర్వే చెప్పలేదా? అందులో ఎన్ని గెలుస్తారనేది చిలక జోస్యంలో రాలేదా? అంటూ పేర్నినాని పవన్‌పై మండిపడ్డారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్‌ కల్యాణ్ మాట్లాడడం దుర్మార్గమైన విషమన్నారు. ప్రజారాజ్యం పార్టీకి, సొంత అన్నకు పవన్‌ వెన్నుపోటు పొడిచారంటూ పేర్నినాని ఆరోపించారు. చిరంజీవి దయతో ఉన్నతస్థాయికి వచ్చిన పవన్‌.. పరోక్షంగా చిరంజీవిని తప్పుబడుతూ మాట్లాడుతున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఓ వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఫైరయ్యారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు.