కారుణ్య మరణానికి అనుమతినివ్వండి

telangan group-2 candidates
telangan group-2 candidates


తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్థుల వినతి
హైదరాబాద్‌: కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్ధులు మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించింది. 2016 జరిగిన టిఎస్‌పిఎఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష మెరిట్‌ జాబితాను ఇంత వరకు అధికారికంగా విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం అలసత్వం మూలాన గ్రూప్‌-2 మెరిట్‌ జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ఫలితాలు వెలువడక మనసిక క్షోభకు గురవుతున్నామని తెలపారు. పరీక్ష జరిగి రెండున్నరేళ్లు కావస్తున్నా మెరిట్‌ లిస్టును వెల్లడించక పోవడం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతుంది. ఈ మేరకు మానవ హక్కుల కమీషన్‌ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టి అనంతరం వినతిపత్రం సమర్పించారు.
పరీక్ష నిర్వహణలో టిఎస్‌పీఎస్సీ తప్పిదాల వల్ల మెరిట్‌ లిస్టులోని ఉన్న తాము బాధితులుగా మారామని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల చుట్టూ తిరిగి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి పరిస్థితి వివరించినా వారిలో కనీస స్పందన లేదు. దీంతో ఉద్యోగం రాక, వేరే ఉద్యోగం చేయలేక ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని మానవ హక్కుల కమీషన్‌ ఎదుట వాపోయారు.