వ్యాక్సిన్ తీసుకుంటే కువైత్‌లోకి అనుమతి..కువైత్ ప్రభుత్వం

గల్ఫ్: గుర్తింపు పొందిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న ప్రవాస భారతీయులను తమ దేశంలోకి తిరిగి రావడానికి అనుమతిస్తామని కువైత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలంగా విదేశీయుల రాకను కువైత్ నిషేధించింది. దీంతో సెలవుపై మాతృభూమికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైత్‌ రాలేక భారీ సంఖ్యలో స్వదేశంలోనే ఇరుక్కుపోయారు.

ఈ నేపథ్యంలో రెండు డోసుల టీకా తీసుకున్న విదేశీయులను ఆగస్టు ఒకటి నుంచి తిరిగి దేశంలోకి అనుమతించాలని కువైత్ మంత్రివర్గం నిర్ణయించింది. గర్తింపు పొందిన వ్యాక్సిన్ తీసుకొని, 72 గంటల ముందు చేసిన పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారిని దేశంలోకి అనుమతిస్తామని కువైత్ ప్రకటించింది. వచ్చిన వారు వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి, మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/