శాశ్వత భూహక్కు- భూరక్ష

నేటి నుంచి కొత్త పథకం ప్రారంభం

  • సమగ్ర భూసర్వే ద్వారా దేశచరిత్రలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం: సిఎం జగన్‌
  • ‘సర్వే ఆఫ్‌ ఇండియాతో సమన్వయం
  • నాడు,నేడు తొలిదశ ఫిబ్రవరికి పూర్తి
AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: దేశ చరిత్రలోనే సమగ్ర భూసర్వే ద్వారా నూతన అధ్యాయానికి శ్రీకారం చూడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు. పూర్తి పార దర్శకతతో అవినీతికి,అక్రమాలకు తావులేకుండా ఆ కార్యక్రమం ఈ నెల 21 నుంచి జరుగుతుందని వెల్లడించారు.

ఎక్కడ ఏ చిన్న భూవి వాదం చోటు చేసుకోకుండా సంచార న్యాయ స్థానాలను అందుబాటు లోకి తీసుకుని వస్తున్నట్లు వివరించారు.గ్రామ సచివాలయాలోత్లనే ఈ కార్యక్రమంలో భాగంగా సబ్‌రిజిస్ట్రార్లను అందుబాటులోకి తీసు కుని వస్తున్నట్లు తెలిపారు.

సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతంది.ఈ క్రమంలో సంబంధిత అధికార యం త్రాంగానికి ఆదివారం సీఎం అనేక మార్గదర్శకాలు జారీ చేసారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు –

భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేం దుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికబద్దంగా సిఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారయంత్రాంగం సన్నద్దమవుతుంది.వందేళ్ల రాష్ట్ర చరిత్రలో దేశంలో ఎక్కడా తల పెట్టని అతిపెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందున ఆ దిశలో అధికార యంత్రాంగం ప్రతి అడుగు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా సూచిం చారు.అందుకు అవసరమై నవన్నీ సమకూర్చుకుంటూ చర్యలు చేప ట్టినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

హైబ్రిడ్‌ మెథడ్‌లో కం టిన్యూస్‌ ఆపరేటింగ్‌ రెఫరెన్స్‌ స్టేషన్స్‌ (కార్స్‌), డ్రోన్స్‌ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్దిష్ట సమయంలో సర్వే క్రతు వు పూర్తిచేసేందుకు టైమ్‌లైన్‌ రూపొందించినట్లు తెలిపారు. రెవె న్యూ, సర్వే సెటిల్‌మెంట్‌, సర్వే ఆఫ్‌ ఇండియాతో సమన్వయంతో రీసర్వేకు నిబంధనావళి రూపొందించామని వివరించారు.

మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల పరిథిలో భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులను మూడు దశల్లో సర్వే చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 5,122 గ్రామాల్లో, రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.

తదుపరి మూడో దశలో మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తిచేస్తారు. డ్రోన్‌సర్వే కోసం సర్వే ఆఫ్‌ ఇండియానే డ్రోన్ల ను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఆ సంస్థ సర్వేయర్ల బృందం రాష్ట్రానికి చేరుకున్నట్లు అధికారులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకున్నారన్నారు.

రెవెన్యూ రికార్డుల స్వచ్చికరణ కార్యక్రమం చక చకా సాగుతోందన్నారు, ఎంపిక చేసిన గ్రామాల సరిహద్దు రాళ్లను అక్కడి సర్వేయర్లు గుర్తించారన్నారు.ఆ రికార్డులను సర్వే టీమ్‌కు అందచేశామన్నారు. సర్వే సమయంలో వచ్చే వివాదాలను అక్కడి కక్కడే పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 670 మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయ నుందన్నారు.

ఈ సర్వేలో జిల్లాలకు సంబంధించి జాయింట్‌ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.. ర

ాష్ట్ర స్థాయిలో రీసర్వేకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిన దశలో గ్రామాల వారీగా సర్వే ప్రారంభమయ్యే తేదీలను ఆయా జిల్లా కలె క్టర్ల పేరుతో సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్లు నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వివరించారు.

రీసర్వే సమయంలో అందుబాటులో ఉండాలని గ్రామ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలు, పట్టణాల వారికి కచ్చితంగా సూచించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.ఈ విషయంలో గ్రామ సచివాలయ సిబ్బంది అలసత్వాన్ని విడిచిపెట్టాలన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/