కూరగాయలతో సంపూర్ణ ఆరోగ్యo

కూరగాయలతో సంపూర్ణ ఆరోగ్యo
Perfect health with vegetables

చాలా మంది కూరగాయలు తినేందుకు ఇష్టపడరు. వాటి బదులు జంక్‌ఫుడ్‌, బేకరీ ఉత్పత్తుల మీద ఆసక్తి చూపుతారు. కానీ ఆహారంలో వెజిటబుల్స్‌ తగ్గించడం వల్ల చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు.

భోజనంలో కూరగాయలు తగ్గితే అలసట వస్తుంది. శరీరానికి విశ్రాంతి కావాలనే సంకేతమే అలసట. ఇది అందరిలోను కనిపిస్తుంది. అయితే తరచుగా అలసటకు గురవుతుంటే తగినన్ని కూరగాయలు తినటం మంచిది. ఆకుకూరలు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే కిడ్నీబీన్స్‌, పప్పుధాన్యాలు, పుట్టగొడుగులు తినాలి. వీటిలోని విటమిన్‌ బి, ఐరన్‌ అలసటను మాయం చేస్తాయి. వాతావరణం కొద్దిగా మారితే చాలు కొందరిలో తమ్ములు, దగ్గు వస్తాయి.

ఇందుకు కారణం వ్యాధినిరోధక శక్తి తగ్గడం. ఇలాంటప్పుడు ఆహారంలో విటమిన్‌ సి అధిక మొత్తంలో ఉండే కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఏదైనా విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటయితే డైట్‌లో వెజిటబుల్స్‌ తగ్గడం వల్ల వచ్చే ఈ సమస్య తగ్గాలంటే క్యారెట్లు, బ్రకోలి, మొక్కజొన్న, టిమాటో వంటివి ఎక్కువగా తినాలి. కూరగాయలు తింటే ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు అన్ని రకాల పోషకాలు అందుతాయి. అయితే వీటిని తగ్గిస్తే అనారోగ్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
విటమిన్‌ సి లోపం వల్ల చర్మం మీద దద్దుర్ల మాదిరి మచ్చలు ఏర్పడతాయి. చర్మం మీద చాలా చోట్ల ఈ మచ్చలు ఏర్పడినప్పుడు రెడ్‌ కాప్సికమ్‌, కాలే, బ్రకోలి, ముదురు రంగు కూరగాయలు ఎక్కువగా తింటే సమస్య తగ్గుతుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com