ముల్లంగితో సంపూర్ణ ఆరోగ్యం

చలికాలంలో ఎన్నో లాభాలు- కాయగూరలు- ఆరోగ్యం

Perfect health with radish
Perfect health with radish

సన్న బడాలని అనుకునేవారు ముల్లంగిని తరచూ తినేలా చూసు కోవాలి. ఫైబర్‌, కార్బో హైడ్రేట్స్‌ ఉన్న ముల్లంగితో కడుపు బాగా నిండి, ఆకలిని అదుపు చేస్తుంది. తక్కువ కెలెరీ లున్న ములంగితో త్వరగా ఆకలి అనే భావన కలగకుండా ఉంటుంది.
విషయానికి వస్తే కేవలం సాంబార్‌, కూర, పచ్చడి తప్పితే ఇతర రూపాల్లో పెద్దగా మనవారు ముల్లంగి తినరు. పోషకాహార నిపుణుల సలహాతో ఇప్పుడిప్పుడే మనవారు ముల్లంగిపై అపోహలు తొలగించుకుంటున్నారు. చలికాలంలో ముల్లంగి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఔషధాల పుట్ట…

ముల్లంగి దీని రుచి ఆస్వాదించడం మొదలుపెడితే పచ్చివే కరకరా తినేస్తారు. శీతాకాలంలో ఎక్కువగా పండే ముల్లంగి తింటే రోగనిరోధక శక్తి బాగా వృద్ధిచెందుతుంది. సి విటమిన్‌ పుష్కలంగా ఉన్న ముల్లంగి చలికాలంలో జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా కాపాడుతుంది. తరచూ ముల్లంగి తింటే రోగాలు దరిచేరకుండా ఉంటాయి.

గుండె పదిలం.

యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ముల్లంగి మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉండేలా కాపాడుతుంది. హృద్రోగాల బారిన పడకుండా ముల్లంగి పనిచేస్తుంది. ఆంథోసైనిన్‌ను ఎక్కువగా ఉన్న ముల్లంగి తింటే గుండె జబ్బులు రావు.

జీర్ణం ..

జీర్ణకోశ సమస్యలున్నవారు ముల్లంగి అధికంగా తినాలి. దీంతో జీర్ణక్రియలు చురుకూ అజీర్తి వంటి సమస్యలు పోతాయి. మలబద్ధకం కూడా వదిలించే శక్తి ముల్లంగికి ఉంది. ఇదులో ఉన్న పీచు పదార్థం మలబద్ధకానికి విరుగుడుగాపనిచేస్తుంది. మొలలు ఉన్నవారు ముల్లంగి తినటం అలవాటు చేసుకుంటే మంచిది. బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ను అదుపులో ఉంచే శక్తి ఉన్న ముల్లంగి మదుమేహవ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్రర్తకణాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది.

ఆకులు, విత్తనాలు కూడా…

ముల్లంగి మాత్రమే కాదు వాటి ఆకులు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి మంచిది. వీటి రుచి బాగుంటుంది కూడా. ముల్లంగి ఆకుతో కూర చేసుకుంటే భలే వెరైటీగా ఉంటుంది. ఈ ఆకు రసాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ముల్లంగితో ఒనగూరే ప్రయోజ నాలన్నీ వాటి ఆకులతో కూడా వస్తాయి. కామెర్ల నివారణకు ఈ ఆకులు దివ్యౌ షధంగా పనిచేస్తుంది. ముల్లంగి, వాటి ఆకులే కాదు రసం కూడా మంచిది. తాజా ముల్లంగి రసం తీసి అందులోకి నాలుగు చుక్కల నిమ్మరసం కావాలంటే చిటికెడు
మిరియా పొడి వేసుకుని జ్యూస్‌ ట్రై చేయండి. మూత్ర సంబంధిత వ్యాధులకు ఇది విరుగుడుగాపనిచేస్తుంది.

కెలరీలు కలిసి వస్తాయి…

ఫోలిక్‌ యాసిడ్‌ కూడా ఉంది. ఇందులోని యాంతసినిన్‌ వల్ల యాంటిక్యాన్సర్‌ ఔషధగుణాలు పుష్కలంగా మన ఒంటికి చేరతాయి. పురుషుల్లో సంతానోత్పత్తికి ముల్లంగి సహకరిస్తుంది. అందుకే ఇది సూపర్‌ ఫుడ్‌గా పేరుగాంచింది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కదా
అన రోజూ తిన్నారనుకోండి అతిసారం వంటివి మిమ్మల్ని బాధిస్తాయి కనుక అతిగా తినకండి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/