మిరియాల అన్నం

రుచి: వెరైటీ వంటకాలు’చెలి’ పాఠకుల కోసం

Peppermint rice
Peppermint rice

కావలసినవి:
పొడిపొడిగా వండిన అన్నం ఒకటిన్నర కప్పు,
నెయ్యి రెండు టేబుల్‌స్పూన్లు
మిరియాల పొడి: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: ఒకటి,
సెనగపప్పు: రెండు చెంచాలు, ఎండుమిర్చి: ఒకటి, జీలకర్ర, చెంచా, ఉప్పు చిటికెడు

తయారుచేసే విధానం
స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక సెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు పలుకులూ వేయించుకోవాలి. అన్నీ వేగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకూ వేయించి అన్నం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

పెసరబూరెలు
కావలసినవి
పెరసరపప్పు- కప్పు, (రెండు గంటలసేపు నానబెట్టుకోవాలి), చక్కెరపొడి- రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపొడి- రెండు టుబుల్‌స్పూన్లు, యాలకుడిపొడి- చెంచా, బియ్యం- కప్పు,
మినప్పప్పు- కప్పు, ఉప్పు, చిటికెడు, నూనె వేయించేందుకు సరిపడా, నెయ్యి చెంచా

తయారుచేసే విధానం:
బియ్యం, మినప్పప్పును అయిదారుగంటల ముందు నానబెట్టుకుని మెత్తగా రుబ్బి ఉప్పు కలిపి పెట్టుకోవాలి. పెరసపప్పులో నీళ్లు వంపేసి మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. దీని నెయ్యిరాసిన ఇడ్లీ రేకులపై వేసుకుని ఆవిరిమీద పదినిమిషాలు ఉడికించుకుని తీసేయాలి. చల్లారాక పొడిలా చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టిచెక్కరపొడి, కొబ్బరపొడి, పెసరపొడి, యాలకులపొడి వేయాలి. అన్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/