టిఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు ఏకపక్షంగా గెలిపిస్తారు

మున్సిపల్‌ ఎన్నికల్లో హుజుర్‌ నగర్‌ ఫలితాలే మళ్లీ వస్తాయి

jagadish reddy
jagadish reddy

సూర్యాపేట: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా టిఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం హుజుర్‌నగర్‌ నియోజక వర్గంలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో భారీ రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ ఫలితాలే వస్తాయని జగదీశ్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఓటు టిఆర్‌ఎస్‌కు వేయడం వల్ల తెలంగాణ మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. సీఎం కెసిఆర్‌ దార్శనికత, విజన్‌ ఉన్న నాయకుడు కావడం వల్లనే తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా నిలిపారని మంత్రి అన్నారు. కెసిఆర్‌ తెలంగాణకు సీఎం కాకపోయుంటే వెయ్యి సంవత్సారాలైనా కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చేది కాదని, తెలంగాణ ప్రజల స్థితిగతులు మారేవి కావన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని జగదీశ్‌ రెడ్డి కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/