ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి

పకడ్బందీ లాక్‌డౌన్ అమలుతోనే సురక్షితంగా ఉన్నాం

malla reddy

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి పలు ప్రాంతాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గ్రౌండ్‌లో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలకు ధన్యవాదాలు అని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, పకడ్బందీ లాక్‌డౌన్ అమలుతోనే సురక్షితంగా ఉన్నామన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/