మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న జనం

వలస బాటలో ఉక్రెయిన్ పౌరులు

People at underground metro stations
People at underground metro stations

కీవ్‌లో ప్రజలంతా అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లు, సబ్‌ వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. అందులోంచి బయటకు రావొద్దని పదే పదే లోకల్ పోలీసుల హెచ్చరికలు వెళ్తున్నాయి. కీవ్‌లో చాలా చోట్ల ఇంకా సైరన్లు మోగుతున్న పరిస్థితి ఉంది. లక్షలాదిగా పౌరులు ఇళ్లువదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస బాట పట్టారు. రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. భారీ ఎత్తున ఉక్రెనియన్లు రుమేనియా, హంగరీలకు వలస పోతున్నారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/