కాషాయ జెండా ఎగురవేయాలి

ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది

vivek venkataswamy
vivek venkataswamy

మంచిర్యాల: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయాలన్నారు మాజీ ఎంపీ, బిజెపి నేత వివేక్‌ వెంకటస్వామి. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. సీఎం కెసిఆర్‌ అధికారంలో వచ్చి ఆరు సంవత్సరాలైనా మున్సిపాలిటీలకు చేసింది ఎమీ లేదని విమర్శించారు. కాగా మంచిర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో పొటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులతో ఆదివారం వివేక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి విజయం కోసం సలహాలు, సూచనలు చేశారు. ప్రజలు బిజెపి వైపు ఉన్నారని దేశంలో బిజెపి అధికారంలో వచ్చాక పలు అభివృద్ది పనులు జరిగాయని తెలిపారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ప్రజలను చేతన్యం పరిచి బిజెపి విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు వివేక్‌ పిలుపునిచ్చారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/