సీఎం జగన్‌ తీరుతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారు

kanna lakshmi narayana
kanna lakshmi narayana

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన విషయంలో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి అని నేను ముందే చెప్పానని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ అన్నారు. ఆరు నెలల కాలంలోనే అధికార యంత్రాంగంపై సీఎం జగన్‌ పట్టుకోల్పోయారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడం లేదని జగన్‌ చెప్పడం సరికాదని అన్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడే అమిత్‌ షాను కలవాలనుకోవడం సరికాదని చెప్పారు. విద్యుత్‌ ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సూచనలను సీఎం వినడం లేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు ఇష్టం వచ్చినట్టు పాలిస్తామనే ధోరణిలో వెళ్తున్నారని కన్నా విమర్శించారు. సీఎం జగన్‌ తీరుతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తులను తాకట్టు పెడితే..ఇప్పుడు జగన్‌ ప్రజల ఆస్తులు అమ్మేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/