నెలకు రూ.10వేలు పెన్షన్‌కు ప్రతిపాదన

PENSION---
PENSION—

నెలకు రూ.10వేలు పెన్షన్‌కు ప్రతిపాదన

న్యూఢిల్లీ: అతుల్‌ పెన్షన్‌ యోజన పథకం మరింత ఆకర్షణీయంగా రూపొందిం చేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలేటరీ సంస్థ పథకంలో కొన్ని మార్పులు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎపివైగా వ్యవహరించే ఈ పథకంలో కనీస రాబడి నెలకి 10రూపాయలు ఉండేట్టు గానూ, ఇప్పుడున్న 40ఏళ్ల ప్రవేశ అర్హతను 50ఏళ్లకు పెంచవలసిందిగానూ ఒక సూచన చేసింది. ఈ రకమైన మార్పులు చేయడం వల్ల వ్యవస్థీకృతం కాని రంగాలలోని సిబ్బందికి రిటైర్మెంట్‌ ప్లాన్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుందని సూచించింది. ఈ పథకంలో 2019నాటికి 1.5కోట్ల మంది చందాదారులు చేరుతారని ఒక అంచనా. వృద్ధుల జీవన వ్యయం బాగా పెరిగిందని, అందుకు అనుగు ణంగా మార్పులు కూడా చేయాలని రెగ్యులేటరీ సంస్థ అభిప్రాయం వ్యక్తంచేసింది. ప్రస్తుతం 60ఏళ్లవరకు ఉన్న వయోపరిమితులు 70ఏళ్లకు పెంచాలని కూడా సూచించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్‌ పథకం ప్రకారం కనీసం రూ.1000నుంచి రూ.5000వరకు పెన్షన్‌ లభిస్తోంది. అయితే పరిమితులను పెంచడం వల్ల నెలకు 10,000పెన్షన్‌ లభించగలదని భావిస్తున్నారు. ఈ పథకంలో చేరిన వారికి పన్ను రాయితీలు కూడా లభిస్తున్నాయి. దురదృష్టవశాత్తు పెన్షన్‌ తీసుకుంటున్నవారు ఎవరైనా మరణిస్తే వారిమీద ఆధారపడిన ఆడవారికిగానీ, మగవారికి గానీ ఈ పెన్షన్‌ కొనసాగుతోంది. లేదంటే, నామినీకి పెన్షన్‌ కార్పస్‌ లభిస్తోంది. పెన్షన్‌ పథకంలో మార్పులను కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా చందాదారుల సంఖ్యపెరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.