పెండింగ్ పనులు పూర్తి చేయాలి

అధికారులకు మంత్రి ‘ఎర్రబెల్లి’ ఆదేశం

TS Minister Yerrabelli
TS Minister Yerrabelli

Hyderabad: పల్లె ప్రకృతి వనాల పనులు, వైకుంఠదామాలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాపై అధికారులతో  మంత్రి సమీక్షించారు.   ఆయా శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తనియా,పంచాయితీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు,  సంజీవ రావు హాజరయ్యారు.

గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.  గ్రామ పంచాయతీల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారనీ, సీఎం అభినందనల నేపథ్యంలో మరింత ఉత్సాహంతో పని చేయాలని మంత్రి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/