లాకెట్‌ పూలగుత్తి

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌…

Pendant bouquet
Pendant bouquet

నెక్లెసులూ హారాలు కంటెలూ గుండ్ల గొలుసులూ ఇలా నగల్లో చాలారకాలే ఉన్నా పెండెంట్‌ లేదా లాకెట్టు గొలుసులకో ప్రత్యేకస్థానం ఉంది. మిగిలినవనీన వేడుకల సమయంలోనే ధరిస్తే పెండెంట్‌తో కూడిన చెయిన్లను రోజువారీ వేసుకుంటుంటారు.

అందులో భాగంగానే పూలబొకేల్నీ బుట్టల్నీ కూడా లాకెట్లలా చేయించుకుని మెడలో వేసుకుంటున్నారు. అదేమంటే పూలను చూస్తే కలిగే ఆనందమే వేరు. అవి ఆశావాదానికీ సంకేతాలు. అందుకే ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పేటప్పుడూ ఆరోగ్యం బాగా లేనప్పుడూ పూలనే కానుకలుగా అందిస్తుంటాం.

Pendant bouquet

అలాంటి పూలు మన మెడలోనే నిత్యం కళ్లముందు ఉండే మనకీ వాటిని చూసేవాళ్లకీ కూడా ఆనందంగా ఉంటుంది అంటూ భారీ విరవణే ఇస్తున్నారు.

అనడమే కాదు, వజ్రాలూ పచ్చలూ నీలాలూ వంటి రత్నాలూ ముత్యాలూ పగడాలతో పొదిగిన అందమైన లాకెట్ల వేసుకుని కొత్త ఫ్యాషన్‌ కనిపెట్టినట్లు తెగ పోజు కొడుతున్నారు.

అనేది విక్టోరియా కాలంలోనే ఉందట. అప్పట్లో వీటిని లిటిల్‌ గార్డెన్‌ డిజైన్‌ అనేవారట. ఎక్కువగా బ్రూచ్‌ల్లోనూ పెండెంట్లలోనూ ఈ బొకేలూ బుట్టలూ కనిపించేది.

మొదట్లో వీటిని బంగారపు పూత పూసిన వెండితోనే అందంగా చెక్కేవారట. ఆ తర్వాత గాజూరాళ్లూ, రైన్‌ స్టోన్సూ పొదగడంతోబాటు పూరేకుల కోసం ఎనామిల్‌ పూత పూసేవారు.

ఆపై రంగులరాళ్లూ ముఖ్యంగా కోరల్‌, జుడ్‌, ముత్యాలూ పచ్చలూ నీలాలూ వంటి రత్నాల్సీ వజ్రాల్నీ పొదిగి నిజంగానే పూలు విరిసాయా అన్నంత అందంగా తయారు చేస్తున్నారు.

Pendant bouquet

వీటిల్లో కూడా గులాబీలు చామంతలూ లిల్లీలూ ఇలా అన్ని రకాల పూలనూ చొప్పించడంతో అవి మన వాళ్లకీ తెగ నచ్చేయడంతో నయా ఫ్యాషన్‌గా మారిపోయాయి.

బుట్టల అల్లికేకాదు, పూరేకుల సొగసు సైతం స్పష్టంగా అందంగా కనిపించేలా చెక్కు తుండటంతో వాటిమీద నుంచి చూపు తిప్పుకోవడం ఎవరికైనా కష్టమే. అందు కే ఈ పూలబొకేలూ బుట్టలూ అమ్మాయిలకు తెగ నచ్చేస్తున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/