కుప్పం ఫలితాల పట్ల చంద్రబాబు కు పెద్దిరెడ్డి సలహా..

కుప్పం ఫలితాల పట్ల చంద్రబాబు కు పెద్దిరెడ్డి సలహా..

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి..చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారు. చంద్ర‌బాబు పొలిటిక‌ల్ రిటైర్మెంట్ తీసుకుని, విశ్రాంతి తీసుకుంటే ఆయ‌న‌కే మంచిద‌ని పెద్దిరెడ్డి స‌ల‌హా ఇచ్చారు. ఎలాగూ చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ లోనే ఉంటున్నార‌ని.. ఆయ‌న టీడీపీ బాధ్య‌త‌ల‌ను ఎన్టీఆర్ కుటుంబానికి అప్ప‌గించి త‌ప్పుకుంటే మంచిద‌ని అన్నారు. కుప్పం ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడును పూర్తిగా తిర‌స్క‌రించార‌ని పెద్దిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటే.. కుప్పం నుంచి పోటీ చేయ‌లేని ప‌క్షంలో చంద్ర‌బాబు నాయుడు పుంగ‌నూరుకు వ‌చ్చి పోటీ చేయ‌వ‌చ్చ‌ని కూడా పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడు చేతిలో ఓడినా, ఆయ‌న‌పై గెలిచినా.. అది త‌న‌కు మంచిదే అని.. కావాల‌నుకుంటే పుంగ‌నూరుకు వ‌చ్చి పోటీ చేయాల‌ని కూడా చంద్ర‌బాబుకు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌ల‌హా ఇచ్చారు.