వరదల నేపథ్యంలో టెలీకాన్ఫరెన్స్‌

AP Minister Pedddi Reddy Rama chandra Reddy
AP Minister Pedddi Reddy Rama chandra Reddy

Amaravati: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుంగనూరు నుంచి విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో పెద్దిరెడ్డి మాట్లాడారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పన, వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచనలు చేశారు. వరద ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, నిత్యావసరాలు సక్రమంగా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.