టిఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేసే సత్తా బిజెపికే ఉంది

peddareddy
peddareddy, bjp leader

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం బిజెపి అవసరం చాలా ఉందని బిజెపి నేత పెద్దిరెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నెరవేరటం లేదని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న సియం కేసిఆర్‌ ఆలోచన దుర్మార్గమని విమర్శించారు. టిఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేయగల సత్తా ఉన్న పార్టీ బిజెపినేనని, బిజెపి రూపంలో టిఆర్‌ఎస్‌పై తెలంగాణలో తిరుగుబాటు మొదలైందన్నారు. అన్ని వర్గాలు బిజెపి పట్ల ఆకర్షితులవుతున్నాని ఆయన అన్నారు. కొడుకు కేటిఆర్‌ కోసమే కేసిఆర్‌ కొత్త సచివాలయం నిర్మాణం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/