పెద్దపల్లికి స్వచ్ఛత దర్పణ్‌ అవార్డు

ఢిల్లీలో అమీర్‌ ఖాన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్‌ శ్రీదేవసేన

Swachchta Darpan award taking by collector sridevasena
Swachchta Darpan award taking by collector sridevasena

పెద్దపల్లి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మరోసారి రికార్డు సాధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో “స్వచ్ఛత దర్పణ్‌” అవార్డును అందుకుంది. ఈ అవార్డును పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన ఢిల్లీలో అందుకున్నారు. పూర్తి స్థాయిలో సామూహికత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించడం వినియోగించడం, ఇంకుడు గుంతలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన పెంచడం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పెద్దపల్లికి ఖస్వచ్ఛత దర్పణ్గ అవార్డు లభించింది. ఖస్వచ్ఛతగ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతులమీదుగా స్వచ్ఛత దర్పణ్గ అవార్డును ఆమె అందుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/