ఆ బాలిక ఏడిస్తే కళ్లలో నుండి కన్నీరుకు బదులు రాళ్లు రాలుతున్నాయి

మాములుగా ఎవరైన ఏడిస్తే కన్నీరు వస్తుంటుంది..కానీ ఈ బాలిక కు మాత్రం కన్నీరు కు బదులు రాళ్లు రాలుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ పరిధిలోని గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో చాందిని అనే 15 ఏళ్ల బాలిక ఈ వింత సమస్యతో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు ఈ సమస్య నుంచి బాలికను కాపాడుకునేందుకు చాల రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెకు ఈ సమస్య చిన్నప్పటి నుండి లేదు. గత జూలై 27 నుంచి ఆమె ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు చిన్న సైజు రాళ్లు బయటకు వస్తున్నట్లు తల్లిదండ్రులు చెపుతున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలోనే కాదు ఆ కన్ను నలిపినా, ఒత్తిడికి లోనైనా రాళ్లు వస్తుండటంతో ఆ బాలిక నరకయాతన అనుభవిస్తోంది. కన్ను ఎంతో సున్నితమైంది. అలాంటి కంటి నుంచి.. అది కూడా ఎవరో చెప్పినట్టు కేవలం ఎడమ కంటి నుంచే రాళ్లు వస్తుండటంతో ఆమెకు వచ్చిన సమస్య ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఈ బాలికకు వచ్చిన సమస్యను గుర్తించి.. ప్రభుత్వం సాయం చేయాలని.. తమ కూతురిని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని ఈ పేద కుటుంబం కోరుతోంది.