శనగల పలావు

రుచి: వెరైటీ వంటకాలు

Peanut Palau-Taste: Variety of dishes
Peanut Palau-Taste: Variety of dishes

కావలసినవి :

బాస్మతి బియ్యం – 400గ్రా,తెల్ల కాబూలీ శనగలు – 100గ్రా., కొబ్బరి – సగం చిప్ప
పెద్దసైజు టమాటాలు – 6, వెల్లుల్లి – 15 పాయలు సాంబారు ఉల్లిపాయలు -100గ్రా, పచ్చిమిరప – 4పంచదార – ఒక టీస్పూన్‌, లవంగాలు – 4,కొత్తిమీర – ఒక కట్ట, నూనె – ఆరు టీస్పూన్లు,
ఎండు మెంతి ఆకులు – ఒక టీస్పూన్‌
గరం మసాలా పొడి – రెండు టీస్పూన్‌, ఉప్పు-తగినంతదాల్చిన చెక్క – రెండు అంగుళముల ముక్కయాలకులు – 5లేక 6, చిరంజి ఆకులు – 2నెయ్యి – 5 టీస్పూన్లు,

నూరుకోవలసినవి:

సాంబారు ఉల్లిపాయలు – 20, ఎండుమిరపకాయలు – 15జీలకర్ర – రెండు టీస్పూన్లు, వెల్లుల్లి – 10పాయలుతురిమిన పచ్చికొబ్బరి – నాలుగు స్పూన్లు

తయారుచేసే విధానం:

నూనె రెండు టీస్పూన్లు వేసి వేడిచేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయించాలి. చల్లారిన తరువాత తురిమిన కొబ్బరి కలిపి మెత్తగా నూరుకోవాలి. శనగలు నీళ్లలో పోసి పదిగంటలసేపు నాన నివ్వాలి. బియ్యము శుభ్ర ముగా కడిగి పదినిమిషాలు నానపెట్టాలి. నీళ్లను వంచి బాణలిలో పోసి రెండు టీస్పూన్ల నూనె వేసి కాగాక బియ్యం తడి ఇంకే వరకూ వేయిం చాలి.

శనగలు కుక్కర్‌లో పావుగంటసేపు ఉడికించాలి. టమాటాలను పదినిమిషాలు మరగకాచిన నీళ్లలో వేసి తర్వాత తీసి చల్లటినీటిలో వేయాలి. ఒక నిమిషం తర్వాత దానిపై తోలుతీసి నూరి వడకట్టాలి. ఈ ప్రకారం చేయుటను బ్లాంచింగ్‌ అంటారు.

కొబ్బరితురుము, కొంచెం నీరు పోసి మెత్తగా నూరి రెండుసార్లుగా కొబ్బరిపాలు తీసి ఉంచాలి. వెల్లుల్లి తొక్కతీసి ఉంచాలి. బరువుగల ఇత్తడి పాత్రలో నూనెవేసి కాగాక దాంట్లో దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, చిరంజి ఆకువేసి వేయించాలి. దాంట్లో నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగాక రుబ్బిన మసాలా వేసి సన్నగి సెగలో కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి.

టమాట ముద్ద, కస్తూరిమెంతి, ఉప్పు, కొద్దిగా పంచదార, మసాలా పొడివేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. దాంట్లో ఉడికిన శనగలు, కొబ్బరిపాలు పొయ్యాలి. అవి కాగి తెర్లడం మొదలుపెట్టాక వెంటనే బియ్యంపోసి బాగా కల పాలి.

ఒక పళ్లెములో గట్టిగా మూసి దానిపై ఏదైనా బరువ్ఞ పెట్టి పావ్ఞగంట లేక ఇరువది నిమిషాలు సన్నని సెగలో ఉడకనివ్వాలి. మధ్యలో కలియపెట్టడం చేయకూడదు. సన్నగా తరిగిన కొత్తిమీర, వేయిం చిన జీడిపప్పుపైన అలంకరించి వడ్డించాలి.

బాసుమతి బియ్యం ఎక్కువసేపు నీటిలో నానపెట్టవద్దు. కడగకూడదు. ఆ విధంగా చేస్తే బియ్యములో గల సువాసన పోతుంది. పలావ్‌, ఫ్రైడ్‌ రైస్‌ చేసేటప్పుడు బరువుగల ఇత్తడి పాత్రలు గానీ ప్రెషర్‌ కుక్కర్‌గానీ ఉపయోగించాలి. మామూలు స్టీల్‌పాత్రలో అన్నం త్వరగా అడుగంటే అవకాశమెక్కువ.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/