‘పీనట్‌ డైమండ్‌’

డిఫరెంట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యం

'పీనట్‌ డైమండ్‌'
‘Peanut Diamond’-New Movie

ఎఎస్‌పి మీడియా హౌస్‌, జివి ఐడియాస్‌ పతాకాలపై ప్రొడక్షన్‌ నెం1గా వెంకట్‌ త్రివర్ణ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో అభినవ్‌ సర్ధార్‌, వెంకటేష్‌ త్రివర్ణ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘పీనట్‌ డైమండ్‌’

అభినవ్‌ సర్ధార్‌, రామ్‌కార్తీక్‌ తమిళరాసన్‌, శాని సాల్మాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాల్‌ టైగర్‌ ఫేమ్‌ బీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు..

ఒక డిఫరెంట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈచిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

నిర్మాతలు మాట్లాడుతూ, రెండు కాలమానాలకు సంబంధించిన ఒక విభిన్న కథాంశంతో అన్ని వార్గల వారిని ఆకట్టుకునేలా ఈ మూవీ ఉంటుందన్నారు.

1989 లో ఒక కథ జరుగుతూ ఉంటే దానికి పార్లల్‌గా 2020లో మరోక కథ రన్‌ అవుతూ ఉంటుందన్నారు.. ఆ రెండు కథలకు సంబంధం ఏంటి అనేదే చిత్రమన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/