నగరంలో ప్రశాతంగా కొనసాగతున్న పోలింగ్‌

hyderabad-cp-anjani-kumar
hyderabad-cp-anjani-kumar

హైదరాబాద్‌: నగరంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతగా కొనసాగుతుందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. కమిషనర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. పాతబస్తిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు ఎటువంటి వదంతులు నమ్మకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/