శాంతి సామరస్యాలకు ప్రతీక ఇండోపసిఫిక్‌ ప్రాంతం

indo-pasific summit
indo-pasific summit

ఆసియాన్‌ సదస్సులో ప్రధానిమోడీ
సింగపూర్‌: ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ నిరంతరం శాంతియుత సామరస్య వాతావరణాన్నే కోరుతున్నదని ప్రధాని నరేంద్రమోడ ఈపేర్కొన్నారు. సముద్రజలాలపై పరస్పర సహఖారం, ప్రాంతీయ సమగ్ర ఆర్దిక భాగస్వామ్య ఒప్పందానికి భారత్‌ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తూర్పు ఆసియా దేశాలమద్య సంస్కృతిక ఆర్ధిక, బహుళ రంగాల్లో పరస్పర సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధానిమోడీ 13వ తూర్పు ఆసియా సదస్సుసందర్భంగా సింగపూర్‌కు వచ్చిన ఆయన సదస్సులో మాట్లాడారు. ప్రధానిమోడీ వరుసగా ఐదో తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్నారు. 2005లో చేరినతర్వాత భారత్‌ నిరంతరాయంగా తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొంటూ వస్తోంది. ఆర్ధిక, సాంస్కృతిక సంబంధాలు సభ్యదేశాల్లో మరింతగాపెంపొందాలని పసిఫిక్‌ ప్రాంతం శాంతియుత సామరస్యవాతావరణం ఉన్న ప్రాంతంగా రూపొందాలన్నదే భారత్‌ లక్ష్యమని అన్నారు. తూర్పు ఆసియా సదస్సులో పది దేశాలున్నాయి. ఇండోనేసియా, థాయిలాండ్‌, సింగపూర్‌, మలేసియా, ఫిలిపైన్స్‌, వియత్నాం, మైన్మార్‌, కాంబోడియా, బ్రూనై లావోస్‌, ఆస్ట్రేలియా, చైనా, భారత్‌, జపాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణకొరియా, రష్యా, అమెరికా ఈ దేశాలన్నీ తూర్పు ఆసియా ప్రాంతం కిందకి వస్తున్నాయి. ప్రధాన మంత్రి ఈ సదస్సులో విశిష్ట అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం ఇండోపసిఫిక్‌ప్రాంతంలో అమలుకావాలని అన్నారు. అంతేకాకుండాప్రధాని వివిధ దేశాల నేతలతో ముఖాముఖి పాల్గొన్నాఉ. జపాన్‌ ప్రదాని షింజో అబేను కూడా కలిసి చర్చలుజరిపారు. సదస్సు ప్రాథమిక దశ పూర్తయిన తర్వాత నేతలందరూ మీడియాకు ఫోజులిచ్చారు. అంతకుముందు ప్రధాని ఆగ్నేయాసియా దేశాల ఉపాహార విందులో పాల్గొన్నారు. సముద్రజలాలపై రక్షణ సహకారం పరస్పరం అందాలని కోరారు. ఆసియాన్‌ నేతలు పలువురితో ఆయనముఖాముఖి నిర్వహించారు. అంతేకాకుండా సింగపూర్‌ను సందర్శించే అవకాశం లభించిన ఎన్‌సిసి కేడెట్‌లను సైతం కలుపుకున్నారు. యువ స్నేహితులను కలవడం సంతోషంగా ఉందన్నారు. కేడెట్‌ ఎక్ఛేంజి ప్రోగ్రాం కింద ఇరుదేశాల ప్రతినిధులను రెండుదేశాలకు పంపించుకున్నారు. బుధవారంనుంచి రెండురోజులపర్యటనను ప్రారంబించిన ప్రధాని ఫిన్‌టెక్‌ఫెస్ట్‌లో తన కీలక ప్రసంగంచేసారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా, థాయిలాండ్‌రపీమియర్లతో ద్వైపాక్షిక చర్చలుజరిపారు. వాణిజ్యం, రక్షణ,భద్రతరంగాల్లో పరస్పర సహకారం మరింతపెరగాలని ఆకాంక్షించారు. ఆగ్నేయాసియా దేశాలతోజరిగిన సదస్సులో పాల్గొనడం ద్వారా భారత్‌ ఆసియాన్‌తో బంధం మరింత పటిష్టంచేసుకోవాలని భావిస్తోందని భారత్‌కు బయలుదేరే ముందు ప్రధాని వెల్లడించారు.