తెలంగాణలో పీఈసెట్‌ షెడ్యూలు

తెలంగాణలో పీఈసెట్‌ షెడ్యూలు
PE CET schedule in Telangana

Hyderabad: తెలంగాణలో బీపెడ్‌, డీపెడ్‌ ప్రవేశాల కోసం పీఈసెట్‌ షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 21న పీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 13 వరకు ఆన్‌లైన్‌లో పీఈసెట్‌ కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పించేందుకు మే 6 వరకు గడువు విధించారు. ఏప్రిల్‌ 20 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. మే 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన వారం తర్వాత పీఈసెట్‌ ఫలితాలను వెల్లడించనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/