ఏపీలో PCV డ్రైవ్‌ ప్రారంభం..

ఏపీలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(PCV) డ్రైవ్​ను వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. బుధువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్ చేతుల మీదుగా ఈ డ్రైవ్ ప్రారంభం అయ్యింది. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లను వైద్యారోగ్యశాఖ అందిస్తోంది. కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌ వ్యాక్సిన్​తో కలిపి ఇక నుంచి 10 రకాల వ్యాక్సిన్‌లను పిల్లలకు ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.