18 కోట్లకు పెళ్లి ఫొటోల రైట్స్

PC, Nik Jonas
PC, Nik Jonas

సెలబ్రెటీలు ఏం చేసినా డబ్బు సంపాదించుకోవచ్చు. మొహమాటం పక్కన పెట్టి పర్వాలేదు ఎవరేం అనుకుంటే నాకేంటీ అనుకుంటే ఎడా పెడా డబ్బులు సంపాదించుకోవచ్చు. వారి క్రేజ్ ను బట్టి భారీ ఎత్తున డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అదే పని చేస్తోంది. త్వరలో ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్ ను వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా టాప్ క్లాస్ సెలబ్రెటీలు అవ్వడంతో వీరి వివాహ ఫొటోలు మరియు వీడియోలకు విపరీతమైన డిమాండ్ ఉంది.

ఇంటర్నేషనల్ స్టాండర్స్ ఉన్న ఈ స్టార్ కపుల్ వివాహానికి సంబంధించిన ఫొటోల రైట్స్ ను ఒక ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న ఫొటో కూడా బయటకు వెళ్లకుండా చూసుకోనున్నారు. ఈ రైట్స్ ను సదరు సంస్థ దాదాపు 2.5 మిలియన్ డాలర్లు అంటే 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. తమ ఫొటోల రైట్స్ అమ్మగా వచ్చిన డబ్బును ప్రియాంక చోప్రా మరియు నిక్ లు చారిటీకి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

జోధ్ పూర్ లోని రాజకోటలో వీరి వివాహం జరుగబోతుంది. టాప్ క్లాస్ సెలబ్రెటీలతో పాటు దాదాపు 300 మంది ఈ వివాహ వేడుకలో పాల్గొనబోతున్నారు.