సింధు గెలిచింది.. హైదరాబాద్‌ హంటర్స్‌ మాత్రం ఔట్‌!

P.V. Sindhu
P.V. Sindhu

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ పోరాటం ముగిసింది. ఇదివరకే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన హంటర్స్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఓటమితో ముగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు విజయం సాధించినా హంటర్స్‌ను గట్టెంక్కించలేకపోయింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ‘టై’లో హంటర్స్‌ 1-2తేడాతో పుణె 7 ఏసెస్‌పై ఓడిపోయి సెమీస్‌ చేరకుండానే ఇంటిదారి పట్టింది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో పుణె జోడీ గెలువగా.. ఆ తర్వాత ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ఆటగాడు ప్రియాన్షు రావత్‌ పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌, హంటర్స్‌ స్టార్‌ పీవీ సింధు 15-7, 15-8 తేడాతో 7ఏసెస్‌ ప్లేయర్‌ రితుపర్ణ దాస్‌పై సునాయాస విజయం సాధించింది. ఆ తర్వాత పుణె జోడీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎన్‌.సిక్కిరెడ్డివ్లాదిమర్‌ ఇవనోవ్‌ జోడీ విజయం సాధించడంతో హైదరాబాద్‌ స్కోర్లను 1-1తో సమం చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ ఓటమి పాలవడంతో.. హైదబాద్‌ హంటర్స్‌ 12తో ఓడిపోయింది. రెండు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ కోల్పోవడంతో హంటర్స్‌కు నిరాశ తప్పలేదు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/