ఏపి పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ ఎన్నిక

Payyavula Keshav
Payyavula Keshav

అమరావతి: ఏపి ప్రజాపద్దుల కమిటి (పీఏసీ) ఛైర్మన్‌గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పయ్యావులను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి కోసం టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరికి పీఏసీ చైర్మన్ పదవి పయ్యావుల కేశవ్ నే వరించింది.పీఏసీ చైర్మన్ కు మంత్రి హోదాతో పాటు ఎక్కడకు వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/