చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఉలిక్కిపడుతున్న వైఎస్‌ఆర్‌సిపి: పయ్యావుల

చంద్రబాబు పర్యటనతో ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సిపి అసత్య ప్రచారాలు కొట్టుకుపోయాయన్న టీడీపీ నేత

payyavula-kesav-said-ysrcp-shivers-on-chandrababu-delhi-tour

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటనపై ఉలిక్కిపడుతోందని టీడీపీ నేత, ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు చంద్రబాబు పర్యటనతో కొట్టుకుపోయాయన్నారు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. చంద్రబాబుకు సూచించారని పయ్యావుల అన్నారు.

ఢిల్లీలోని అన్ని పార్టీల నేతలతోపాటు ప్రభుత్వ పెద్దలు కూడా చంద్రబాబును సాదరంగా స్వాగతించారన్నారు. ద్రౌపది ముర్మును కలిసిన తర్వాత రాష్ట్రపతిగా ఆమె ఎంపిక సరైనదేనని అనిపించిందన్నారు. ఆమెతో భేటీ అద్భుతంగా జరిగిందని, ఓ తల్లిలా తమతో మాట్లాడారని కేశవ్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/