అమరులైన అధికారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళి

అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Indra karan Reddy
Indra karan Reddy

Hyderabad: అడవుల సంరక్షణలో భాగంగా ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని, వారి సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు.

వారి కృషి,త్యాగం వల్లనే అడవులు కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ వద్ద అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.

తొలుత అమరవీరుల స్థూపం వద్ద విధి నిర్వహణలో అమరులైన వీరులకు మంత్రి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రకృతి వనరులను కాపాడటంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారన్నారు.

కరోనా మహమ్మారి అందరినీ బయపెట్టినా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ధైర్యంగా నిలబడి విధి నిర్వహణలో కొనసాగించడం అభినందనీయమన్నారు.

విధి నిర్వహణలో కరోనా బారినపడి కొంతమంది అధికారులు చనిపోవడం విచారకరమన్నారు.

ముఖ్య అటవీ సంరక్షణ అధికారి శోభ తదితరులు పాల్గొన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/