జూ. ఎన్టీఆర్ హీరోయిన్ ఫై యాసిడ్ దాడి యత్నం ..

జూ. ఎన్టీఆర్ హీరోయిన్ ఫై యాసిడ్ దాడి యత్నం ..

ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి మూవీ లో నటించిన పాయల్ ఘోష్ ఫై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఆమె వారి నుండి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకుంది.

ఈ సంఘటన గురించి పాయల్ మాట్లాడుతూ.. ‘మెడిసిన్స్ తీసుకుందామని చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లాను. వర్క్ ఫినిష్ చేసుకుని కారెక్కుతుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి నాపై దాడి చేశారు.. అప్పుడే చేతికి గాయాలయ్యాయి. వాళ్ల చేతుల్లో యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి. ఈ ఘటన తో ఒక్కసారిగా భయంతో హెల్ప్ చెయ్యడంటూ గట్టిగా అరిచాను.. దాంతో వాళ్లు అక్కడినుంచి పారిపోయారు. ఆ సంఘటన ఇంకా నా కళ్ల ముందే కదులుతుంది.. తలుచుకుంటుంటే భయంగా ఉంది.. నాపై దాడికి యత్నించిన వారిపై కంప్లైంట్ చేసానని ‘ చెప్పుకొచ్చింది.

ఇక తెలుగులో ‘ప్రయాణం’ అనే సినిమాలో నటించిన పాయల్.. ఆ తర్వాత ‘ఊసరవెల్లి’ అనే సినిమాలో సహనటిగా కనిపించింది.