పవన్ స్పీచ్ ఫై వర్మ ప్రశంసలు

రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ తనపై , జనసేన కార్య కర్తలపై వైస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. వైస్సార్సీపీ నేతలను బండ బూతులతో గజగజలాడించాడు. పవన్ మాట్లాడిన తీరు ఫై వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే జనసేన నేతలు , కార్య కర్తలు , అభిమానులు , సినీ ప్రముఖులు ఇలా అంత కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవన్ స్పీచ్ ఫై ప్రసంశలు కురిపించారు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన స్పీచ్ పవన్ కళ్యాణ్‌ది అన్న వర్మ.. జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాదన్నారు. ఓ తీవ్రతతో గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయన్నారు. మంచి వాక్పటిమతో ఉన్న జనసేనాని స్పీచ్ ఎప్పుడూ జనాలను కదిలిస్తుందన్నారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకునే వర్మ ఈసారి ఆయన్ను ప్రశంసించడంపై పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.