రేపు నంద్యాలకు వెళ్లనున్న పవన్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: ఇటివల నంద్యాలలో దివంగత ఎంపి ఎస్పీవైరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పవన్‌ ఈనెల 11(రేపు) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎంపి కుటుంబాన్ని కలిసిన అనంతరం ఆయన సమాధి వద్ద నివాళి అర్పించనున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాల లోక్‌సభ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/