ఏపిలో అభివృద్ధి జరగాలంటే పవన్‌ సిఎం కావాలి

Mayawati, Pawan Kalyan
Mayawati, Pawan Kalyan

విశాఖ: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సిఎం మాయావతి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇద్దరు కూడా విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఏపి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ రెండింట్లోనూ జనసేన కూటమి విజయవంతమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, పవన్‌ కల్యాణ్‌ సీఎం కానున్నారని మాయావతి ఆశభావం వ్యక్తం చేశారు. ఏపి,తెలంగాణలో చాలా కాలం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తగిన న్యాయం జరగలేదు. ఏపీకిచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్‌ వలలో పడవద్దు. ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలి. పవన్‌ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌తో పాటు బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయి. మా కూటమికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం.అని మాయావతి వ్యాఖ్యానించారు. తరువాత పవన్‌ మాట్లాడుతు బీఎస్పీతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. దళితులను సీఎం చేస్తాననని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఆయన విస్మరించారు. దళితుడిని సీఎం చేయకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉంది. మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే నా కల. దశాబ్ద కాలంగా బీఎస్పీతో చర్చలు జరుగుతున్నాయి. అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/