వెంకయ్యనాయుడిపై పవన్ ట్వీట్

ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందనిపిస్తుంది..మొక్కవోని వ్యక్తిత్వం అంటూ ప్రశంసలు

వెంకయ్యనాయుడిపై పవన్ ట్వీట్
Pawan- Venkaiah Naidu

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిత్వాన్ని వర్ణిస్తు ట్విట్‌ చేశారు. మొక్కవోని వ్యక్తిత్వం, విలక్షణ రాజకీయ జీవితం, అమ్మభాషపై అమితమైన మక్కువ, చతురత నిండిన మాటలు ఆయన సొంతం, ఆయనెవరో కాదు గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అంటూ ట్వీట్ చేశారు. ఏ విషయంలోనైనా నిర్భయంగా, మొహమాటం లేకుండా మాట్లాడడం వెంకయ్యనాయుడు నైజం అని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుందని తెలిపారు. ప్రభావవంతమైన ఆయన సలహాలు, సూచనలు సర్వదా ఆచరణీయాలని, ఆయనకు వినయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/