అమరావతిలో పర్యటిస్తున్న పవన్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో పర్యటిస్తున్నారు. ఈరోజు మంగళగిరిలో బయలుదేరిన పవన్.. నవులూరు, కృష్టాయపాలెం, యర్రబాలెం, తుళ్లూరు మండలాల్లోని ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి గ్రామాలలో ఆయన పర్యటించనున్నారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన ప్రకటనలపై రాజధాని రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పవన్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. రెండు రోజులు రాజధానిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. శనివారం రాజధానిలో జనసేన పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులు, రైతు కూలీలతో, ఇతర వర్గాలతో పవన్ సమావేశం కానున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/