ఇలా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదు

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి:ఎన్‌ఎంసీ బిల్లుపై జూనియర్ డాక్టర్లు, వైద్యుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయి చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతపై ఇలా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదన్నారు. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఎన్నో సేవలందిస్తున్నారని, వారి డిమాండ్‌పై స్పందించకపోగా దాడి చేయడం సబబుకాదని పవన్‌ తెలిపారు. వైద్యులు ఆందోళన చేయడంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ పెర్కొన్నారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/