ప్రభుత్వంపై మరోసారి పవన్ విమర్శలు
బడ్జెట్ ని ఎంత మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు..పవన్ కల్యాణ్
Pawan kalyan
అమరావతి: జనసేన అధినత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆయన పలు వివరాలు పోస్ట్ చేశారు. ‘ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా .. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైస్సార్సీపీ ప్రభుత్వం మరిచినట్టుంది’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.
వైస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఏపీలో ఆర్థికాభివృద్ధి లేదని, నవరత్నాల పేరిట మాత్రం వరాలు కురిపిస్తున్నామని చెప్పుకుంటోందని పవన్ ఓ గ్రాఫ్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. రాబడి లేక ప్రభుత్వం అప్పులు చేస్తోందని, నిత్యావసర సరుకుల ధరలన్నింటినీ పెంచుతోందని పవన్ ట్వీట్ చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/