ఎన్నికల కోసం మొదలుపెట్టిన ప్రయాణం కాదు

Pawan
Pawan

మంగళగిరి:   జనసేన అధ్యక్షులు . శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో  జనసేన తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థులతో గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు జనసేనది ఒక ఎన్నికల కోసం మొదలుపెట్టిన ప్రయాణం కాదన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. జనసేన నాలుగేళ్ల క్రితం పోటీ చేసినట్లయితే ఇంకా బలం పెరిగేదని అభిప్రాయపడ్డారు. సమీక్షలు పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక అవగాహనకు వస్తామని పవన్‌ స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు రూ.150 కోట్లు దాటిందని, జనసేన ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసిందని పవన్‌ చెప్పారు.