పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి సన్నిహితుడు – పరిటాల శ్రీరామ్

పవన్ కళ్యాణ్ – పరిటాల కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయని , పరిటాల రవి పవన్ కళ్యాణ్ ను అవమానించారని ఇలా అనేక రకాలుగా చాలామంది మాట్లాడుకోవడం , ప్రచారం చేయడం చేస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇలా ప్రచారం జరుగుతూనే ఉన్న..ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ పరిటాల ఫ్యామిలీ కానీ ఈ ప్రచారం ఫై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా పరిటాల శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి సన్నిహితుడు అని చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు. సమాజం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. మాకు-పవన్‌కు మధ్య ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అదంతా అవాస్తవం. బేస్ లేస్ ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబానికి, పవన్ కళ్యాణ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి ప్రచారాన్ని ఆయన పట్టించుకోరు. మేము కూడా అర్థం చేసుకుంటాం అని తెలిపాడు.