రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ప్రజలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రేమానురాగాల సంగమం రక్షాబంధన్ అని , భారతీయ కుటుంబాలు ఆత్మీయం, అనురాగాలతో పెనవేసుకుని ఉంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

విదేశీయులు సైతం మన కుటుంబ వ్యవస్థను చూసి అబ్బురపడడం చూస్తూనే ఉంటామన్నారు. అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల ప్రేమానురాగాలు అపురూపమైనవని చెప్పారు. కష్టసుఖాల్లో సోదరుడు తోడుంటాడని ఒక భరోసా అని పవన్ చెప్పుకొచ్చారు. అయితే సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ దుస్సంఘటనలు మనసును కలచివేస్తుయన్నారు.

‘‘.ఏ ఆడపిల్లయినా సరే మన ఇంటి ఆడపడుచుగా చూడండి. వారు నిర్భయంగా జీవించే మార్గాన్ని సుగమం చేయండి. ఈ శ్రావణ పూర్ణిమ భారతీయులందరికీ శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.