అన్నయ్య పాటను వీక్షించిన పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రేపు సినిమాలోని పార్టీ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ ను పవన్ కళ్యాణ్ వీక్షించారు. తన అన్నయ్య చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగిల్ ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్, చిరంజీవిలతో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కూడా ఉన్నారు.

Pawan Kalyan who watched Anayya’s song

Community-verified icon


. “వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ… బాస్ పార్టీ” అంటూ సాగే ఈ పాట ఎంతో హుషారు గా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దేవి శ్రీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గతంలో చిరంజీవి – దేవి కలయికలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ మూవీ ఫై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆలపించారు. ఈ గీతానికి దేవిశ్రీనే సాహిత్యం అందించారు. ఈ పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ సరసన తళుక్కుమన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుండగా , రవితేజ, కాథరిన్ ట్రెసా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.