నాటు..నాటు సాంగ్ కు ఆస్కార్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపిన పవన్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లో నిలువడం ఫై అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు సైతం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా లో పెద్ద సంఖ్యలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. ట్వీట్స్ , పోస్టులు , కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
‘నాటు.. నాటు…’ గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు శ్రీ రాజమౌళి, హీరోలు శ్రీ రాం చరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య, గీత రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు.

ఇక ఆస్కార్ ఫుల్ నామినేషన్ లిస్ట్ చూస్తే..

ఉత్తమ చిత్రం:

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌

ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌

ఎల్విస్‌

ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ది ఫేబుల్‌మ్యాన్స్‌

టార్‌

టాప్‌గన్‌: మావెరిక్‌

ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌

ఉమెన్‌ టాకింగ్‌

బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌:

‘‘అప్లాజ్‌’’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)

‘‘హోల్డ్‌ మై హ్యాండ్‌’’ ( టాప్‌గన్‌: మావెరిక్)

‘‘లిఫ్ట్‌ మీ అప్‌’’ (బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్)

‘‘నాటు నాటు’’ (ఆర్‌ఆర్‌ఆర్‌)

‘‘దిస్ ఈజ్‌ ఏ లైఫ్‌’’ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ దర్శకుడు:

మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)

టడ్‌ ఫీల్డ్‌ (టార్‌)

రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)

ఉత్తమ నటుడు:

ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌)

కొలిన్‌ ఫార్రెల్‌ (ది బాన్షీస్‌ ఆఫ్‌ ఇనిషైరైన్‌)

బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)

పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌)

బిల్‌ నిగీ (లివింగ్‌)

ఉత్తమ నటి:

కేట్‌ బ్లాంషెట్‌ (టార్‌)

అన్నా దె అర్మాస్‌ (బ్లాండ్‌)

ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ)

మిషెల్‌ విలియమ్స్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)

మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయ నటి:

ఆంజెలా బాస్సెట్‌ (బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్)

హాంగ్‌ చ్యూ (ది వేల్‌)

కెర్రీ కాండన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

స్టెఫానీ సూ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌:

బబీలోన్‌

బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్

ఎల్విస్‌

ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

మిసెస్‌ హారిస్‌ గోస్‌ టు పారిస్‌

బెస్ట్‌ సౌండ్‌:

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌

ది బ్యాట్‌మెన్‌

ఎల్విస్‌

టాప్‌ గన్‌: మావెరిక్‌

బెస్ట్ ఒరిజినల్ స్కోర్:

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

బబీలోన్‌

ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌

ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ది ఫేబుల్‌మ్యాన్స్‌

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే:

ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌

ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ది ఫేబుల్‌మ్యాన్స్‌

థార్‌

ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌

యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:

ది సీ బీస్ట్‌

టర్నింగ్‌ రెడ్‌

పస్‌ ఇన్‌ బూట్స్‌: ది లాస్ట్‌ విష్‌

గీలెర్మో దెల్‌ టోరోస్‌ పినాకియో

మార్సెల్‌ ది షెల్‌ విత్‌ షూస్‌ ఆన్‌

ఉత్తమ సహాయ నటుడు:

బ్రెన్డాన్‌ గ్లెసన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

బ్రైయిన్‌ టైరీ హెన్రీ (కాజ్‌వే)

జడ్‌ హిర్చ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)

బేరీ కియోఘాన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:

అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా)

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)

క్లోజ్‌ (బెల్జియం)

ది క్వైట్‌ గాళ్‌ (ఐర్లాండ్‌)

ఇయో (పోలండ్‌)

బెస్ట్ సినిమాటోగ్రఫీ:

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

బార్డో

ఎల్విస్‌

ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌

టార్‌

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్:

అవతార్

ది బ్యాట్ మ్యాన్

టాప్ గన్: ది మావెరిక్

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్