జగన్‌ ఆరు నెలల పాలనపై ఫైర్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శలు చేశారు. ఆరునెలల పాలనపై ట్వీట్లు సంధించారు. ఆర్నెల్ల పాలన ఆరు మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, దుందుడుకుతనం, క్షక్ష్యసాధింపు, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ తెలుగులో ఆరు ట్వీట్లు చేశారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాకా జగన్‌ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. వరదనీరు పేరుతో కూల్చివేతకు తెరతీశారని, ప్రజావేదిక కూల్చి ఎలాంటి సంకేతాలను ఇచ్చారని ఇది జగన్‌ విధ్వంస బుద్ధికి అద్దం పడుతుందని అన్నారు. ఇంకా అమరావతి రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్‌ వైదొలగడం, కాంట్రాక్టు రద్దు చేయడం సీఎంగా జగన్‌ దుందుడుకుతనానికి నిదర్శమని పవన్‌ అన్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ రద్దు సరికాదని కామెంట్‌ చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామని చెప్పి తెలుగు భాషను, సంస్కృతి, భారతీయత సనాతన ధర్మం విచ్ఛిన్నతకి శ్రీకారం చూట్టారని పవన్‌ కళ్యాణ్‌ విమిర్శంచారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/