పవన్ బిజెపి ని దూరం పెట్టబోతున్నారా..? స్టీల్ ప్లాంట్ వేదికగా రుజువు కాబోతుందా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..బిజెపి కి దూరం కావాలని డిసైడ్ అయ్యాడా..? ప్రస్తుతం పవన్ తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. గ‌తంలో మోడీ విధానాల‌కు ఆక‌ర్షితుడినై బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవ‌డం వ‌ల్ల 2014లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం చంద్ర‌బాబు ముఖ్యమంత్రి కావ‌డానికి దోహ‌ద‌ప‌డింది. 2019లో బీజేపీ, టీడీపీల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ విభేదించారు. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అనంత‌రం బీజేపీకి దూర‌మ‌వుతున్నార‌నే ప్ర‌చారం జరుగుతున్న వస్తుంది. కానీ బిజెపి శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ దూరం కాలేదనే సంకేతాలు పంపుతున్నారు.

ఈ క్రమంలో గత 250 రోజులుగా సాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం..ఈ నెల 31 న వైజాగ్ రాబోతున్నట్లు ప్రకటించడం తో బిజెపి కి పవన్ దూరం కాబోతున్నాడని అంత ఫిక్స్ అవుతున్నారు. ఈ నెల 31 వ తేదీన మధ్యాహ్నం రెండు గంట లకు స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ కు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి పవన్ కళ్యాణ్‌ మద్దతు తో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీ లోని అన్ని పార్టీలు ఒక్కటైతే… కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు ఉంటాయని స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యం లో జనసేన పార్టీ అధినేత రావడం…. కార్మికుల్లో కాస్త భరోసా కలిగినట్లవుతుంది. మరి ఈ సభ లో పవన్ కేంద్రం ఫై ఎలా నిప్పులు చెరుగుతారనేది ఆసక్తి గా మారింది.