వైసీపీ పాలనా ఫై పవన్ మరో ట్వీట్..ఈసారి హిందూ దేవాలయాలను తీసుకున్నాడు

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ vs వైసీపీ వార్ నడుస్తుంది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో వైసీపీ నేతల ఫై పవన్ కామెంట్స్ చేయడం..దానికి వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగడం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్ తగ్గడం లేదు. ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ తో వైసీపీ సర్కార్ ఫై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ”హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?” ”ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!” అంటూ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసాడు. దీనికి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇక అంతకు ముందు సజ్జల సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గుదిబండలా మారారని విమర్శలు చేసారు.

ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!

హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021