గొప్ప దేశమైన భారత ఖ్యాతి తిరిగి నిలవాలి

ట్విట్టర్ లో పవన్ కల్యాణ

Pawan kalyan
Pawan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పెట్టిన ఓ ట్వీట్‌ వైరల్‌ అయింది. ‘ఒక జాతి సరైన బాటలో నడవాలంటే, ఒక తెలివైనవాడు తెగించాలి. ఒక ధర్మం తిరిగి స్థాపించబడాలంటే, ఒక అధికారం తల తెగిపడాలి… ఒక వారసత్వం నదిలా ప్రవహించాలంటే, ఒక గురువు దీపంలా వెలగాలి. ఒక దేశం ఉద్ధరింపబడాలంటే, ఒక సందేహం యుద్ధం చెయ్యాలి. రాజ్యాన్ని సేవించినవాడు రాముడైతే, ఆ రాజ్యాన్ని సాధించిన వాడే పరశురాముడు’ అని పవన్ కల్యాణ్ ట్వీట్‌ చేశారు. పరశురాముడు ప్రజలందరికీ ధైర్యాన్ని, శక్తిని అందించాలని తాను కోరుకుంటున్నానని, గొప్ప దేశమైన భారత ఖ్యాతి తిరిగి నిలవాలని కోరుకుంటున్నానని పవన్ తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/