ఫార్మా సిటీలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై పవన్‌ దిగ్భ్రాంతి

వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలన్న పవన్

pavan kalyan
pavan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన, నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండీస్ట్రీస్ లో విషవాయువు లీక్ ఘటన మరువక ముందే సాయినార్ సంస్థలో విషవాయువు లీకై ఇద్దరు మృతి చెందడం బాధాకరమని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలపై నిరంతర తనిఖీలు చేస్తుండాలని జనసేన ఎప్పటినుంచో చెబుతోందని, దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో వెంటనే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నందున నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/